చివ్వెంల(సూర్యాపేట) : ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి టి.నాగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుడకుడ క్లస్టర్ పరిధిలోని గాయంవారిగూడెం రైతు వేదికలో నిర్వహించిన సాగుభూముల సంరక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావారణ పరిస్థితుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు ఆయిల్‌పామ్, కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు. ఎకరా వరిసాగుకు అవరమయ్యే నీటిలో మూడు ఎకరాల కూరగాయలు సాగు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త కిరణ్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


