హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో ఆధునిక సదుపాయాలతో నూతన కోర్టు భవనం, న్యాయమూర్తుల నివాస గృహ సముదాయాల నిర్మాణానికి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కోర్టు భవనం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కోసమే నిర్మించారని, ప్రస్తుతం అందులో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, రెండవ అదనపు జిల్లా కోర్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. దాంతో కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బంది సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రస్తుతం పని చేస్తున్న నాలుగు కోర్టులకు తోడుగా మరో మూడు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు హుజూర్‌నగర్‌కు మంజూరైట్లు తెలిపారు. ఆయన వెంట న్యాయవాదులు అంబటి శ్రీనివాస్‌రెడ్డి, నట్టే సత్యనారాయణ, ఉప్పల గోపాలకృష్ణమూర్తి, ఏజీపీ సురేష్‌కుమార్ ఉన్నారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డి


