మార్కెట్
ఇరుకుగా
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను స్థలం కొరత వేధిస్తోంది. జిల్లాలోనే సూర్యాపేట తర్వాత రెండవ అతిపెద్ద మార్కె ట్ కావడంతో సంవత్సరం పొడవునా ఇక్కడకు ధాన్యం, వేరుశనగ, అపరాలు, మొక్కజొన్న ఉత్పత్తులను రైతులు అమ్మకానికి తీసుకొస్తుంటారు. 1973లో సూర్యాపేట మార్కెట్ కింద ఏర్పడిన దీన్ని 1993లో సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారిలోని వారసంత స్థలం పక్కన ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల్లో నెలకొల్పారు. ఇందులో రైతు విశ్రాంతి భవనం, మార్కెట్, ఈనామ్ కార్యాలయాలు నిర్మించారు. వీటితోపాటు గోదాములు, వర్షం వస్తే ధాన్యం తడవకుండా ఉండేందుకు తొమ్మిది షెడ్లు నిర్మించారు. 4 ఎకరాల్లో గదులు, గోదాములు, షెడ్లు పోను మిగతా ఐదున్నర ఎకరాల్లో ఓపెన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది.
ప్రతి సీజన్లోనూ
30 వేల ధాన్యం బస్తాలు
ప్రతి సీజన్లో రోజూ ఈ మార్కెట్కు సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల నుంచే కాకుండా యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల నుం10 వేల నుంచి 30 వేల ధాన్యం బస్తాలతో పాటు ఇతర పంటలు క్రయవిక్రయాలు సాగుతున్నాయి. 20 వేల బస్తాల కంటే ధాన్యం అధికంగా వస్తే మార్కెట్లో స్థలం సరిపోక లోపలికి వెళ్లే రెండు గేట్ల దారుల్లో రాశులు పోస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్కు భారీగా ధాన్యం రావడంతో ఒక్కరోజు మార్కెట్ నడిస్తే కాంటాలు, ఎగుమతులు ఆలస్యం అవుతుంటాయి. దీంతో రెండు రోజులు సెలవులు ఇస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వ్యవసాయ మార్కెట్లోనే ‘ఇంటిగ్రేటెడ్’
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లోనే ఎకరం స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు ప్రారంభించారు. దీంతో వ్యవసాయ మార్కెట్కు స్థలం సరిపోక ఇరుకుగా మారి ధాన్యం పోసుకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా శనివారం 30 వేల నుంచి 40 వేల బస్తాల ధాన్యం, ఇతర సరుకులు కూడా వచ్చాయి. ఈ సమయాల్లో మార్కెట్లో స్థలం సరిపోక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మార్కెట్కు ధాన్యం ఉత్పత్తుల రద్దీ దృష్ట్యా 20 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి కొత్త మార్కెట్ను నిర్మించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.
తిరుమలగిరి మార్కెట్ యార్డులో స్థలం కొరత
ఫ ఇందులోనే ఇంటిగ్రేటెడ్
మార్కెట్ నిర్మాణం
ఫ వడ్ల సీజన్ వచ్చిందంటే
గేట్ల వద్దా రాశులు
ఫ ఇబ్బందులు పడుతున్న రైతులు


