ఆరుతడి పంటల సాగు మేలు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటల సాగు మేలు

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

కోదాడరూరల్‌ : ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు యాసంగిలో నీటి అవసరం తక్కువగా ఉన్న ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేంద్రమోహన్‌ సూచించారు. శనివారం కోదాడ మండలం గుడిబండలో సాగవుతున్న పంటలను పరిశీలించి మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు, కరెంటు ఉత్పత్తి తక్కువగా ఉన్నందున రానున్న రోజుల్లో కూరగాయలకు డిమాండ్‌ పెరుతుందని, రైతులు వాటి సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదేవిధంగా పశువుల మేతకోసం పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవా లన్నారు. కొంతమేర నీటి వసతి ఉన్న రైతులు నీటిని పొదుపుగా వాడుకుంటూ పెసర, కంది, జొన్న వంటి పంటలు సాగుచేయాలన్నారు. రైతులకు కావాల్సిన డ్రిప్‌, స్ప్రింక్లర్లను అందజేయాలని ఉద్యానవనశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు సబ్సిడీపై విత్తనాలను అందజేయాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడి అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ పాలెం రజిని, హార్టికల్చల్‌ అధికారి అనిత, ఏఓ రాజు, కోదాడ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఓ.శ్రీనివాసరెడ్డి, ఏఈఓలు మహేష్‌, నగేష్‌, పిచ్చయ్య, ఇస్మాయిల్‌, రైతులు ఖాజామియా, రఫి, గౌసుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌

సెక్రటరీ సురేంద్రమోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement