సూర్యాపేట అర్బన్ : క్రియాశీలక ఉద్యమాలతోనే సూర్యాపేటకు బుల్లెట్ రైలు, రైల్వే కారిడార్ సాధించుకోగలుగుతామని పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ రైలు సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దీక్షకు పలువురు నాయకులు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐతరాజు పద్మ, కట్టా కల్పన, అనసూయ, లక్ష్మి పాల్గొన్నారు.
మొదటి అలైన్మెంట్కు బీజేపీ కట్టుబడి ఉంది
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బుల్లెట్ రైలు మొదటి అలైన్మెంట్కే బీజేపీ కట్టుబడి ఉందని, అపోహలు నమ్మవద్దని మల్కాజ్గిరి ఎంపీ, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. సూ ర్యాపేట బుల్లెట్ రైలు సాధన అఖిలపక్ష పోరాట, బీజేపీ జిల్లా కమిటీలు శనివారం హైదరాబాద్లో రాజేందర్ను కలిసి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్, కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. ఈటల రాజేందర్ను కలిసిన వారిలో బుల్లెట్ ట్రైన్ సాధన కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, ధర్మార్జున్, వెలుగు వనిత, బూర వెంకటేశ్వర్లు, జర్నలిస్టు భూపతి రాములు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, కడియం రామచంద్రయ్య, తుక్కాని మన్మథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


