చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట పోక్సో కోర్టు స్పెఫల్ పీపీ రఘురామయ్యను శనివారం ఎస్పీ నరసింహ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసీ, శాలువా కప్పి సన్మానించారు. ఇటీవలే పలు పోక్సో కేసుల్లో తన వాదనలు వినిపించి నిందితులకు శిక్ష పడేటట్లు చేసినందుకు పీపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్ పాల్గొన్నారు.
రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి గణేష్
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన రచయితల సంఘం సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి గణేష్, ప్రధాన కార్యదర్శిగా శీలా అవిలేను ఎన్నికయ్యారు. అలాగే, గౌరవ అధ్యక్షుడిగా ఆలేటి శంకర్, గౌరవ సలహాదారులుగా బెల్లంకొండ శ్రీరాములు, గడ్డం నర్సయ్య, తుమ్మ రాజా, ఉపాధ్యక్షులుగా ధర్మూరి వెంకటేశ్వర్లు, పుప్పాల కృష్ణమూర్తి, ఎర్ర హరికిషన్, సంయుక్త కార్యదర్శులుగా గొడితాల వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, సరికొండ నరసింహారాజు, ప్రచార కార్యదర్శిగా పబ్బతి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా ముక్కామల జానకి రాములు, ఏబెల్ శశి, ఎన్సీ.రోజా, పూసోజు పద్మ, పోతుగంటి వీరాచారి, జిల్లేపల్లి జానయ్య, కొరప్రిడత శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, కొండా లింగారావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ సాహిత్య సాంస్కృతిక రంగంలో కవులు రచయితలను ఒక తాటిపై నడిపేందుకే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ముందుంగా శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేసి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం గావించారు. ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కల్యాణం జరిపించారు. ఆ తర్వాత నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతేగాక భక్తులకు అన్నదానం చేశా రు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు తెల్లవారుజాముననే కృష్ణానది స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
వైద్యంలో నర్సుల
పాత్ర కీలకం
నార్కట్‌పల్లి : అత్యవసర వైద్యంలో నర్సుల పాత్ర కీలకమని తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ విద్యుల్లత అన్నారు. శనివారం నార్కట్‌పల్లి కామినేని వైద్య కళాశాలలో నర్సింగ్ విభాగం ఆధ్వర్యంలో శ్రీఎమర్జెన్సీ నర్సింగ్ కేర్శ్రీ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాలతో, రోగాలతో ఆసుపత్రిలో చేరిన రోగికి సంబంధించిన పూర్తి సమాచారం నర్సులు సేకరించాలన్నారు. ప్రమాదాలలో గాయపడిన రోగులకు మొదటి గంట అనేది గోల్డెన్ అవర్‌గా పరిగణించాలని, ఆ సమయాన్ని వృథా చేయొద్దన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాబాసాహెబ్ లక్ష్మణ్‌సింగ్, కిమ్స్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ పివి.రామ్మోహన్, ఆర్గనైజింగ్ చైర్పర్సన్, కిమ్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ శైలజ, సైంటిఫిక్ కమిటీ మెంబర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


