ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరెంట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరెంట్‌ కష్టాలు

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

నకిరేకల్‌(శాలిగౌరారం): కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరెంట్‌ కొరత ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. శాలిగౌరారం మండలం రామగిరిలో సర్పంచ్‌ చాడ చంద్రకళ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో 72 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయలేకపోయిందన్నారు. దాంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించి రైతుల పంటలను ఎండబెట్టిన పాపం సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కనుసన్నల్లోనే బొగ్గు రవాణా పేరుతో రూ.800 కోట్ల స్కాం జరిగిందన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నింపి పంటలకు సాగునీరందించే అవకాశం ఉన్నా, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే దుర్మార్గపు ఆలోచనలతో తెలంగాణను ఏడారిగా మార్చారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం ఉండబోతుందన్న విషయం 18 నెలల క్రితమే శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఎల్‌నినోను అధిగమించే వనరులు తెలంగాణకు ఉన్నా రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజా సమస్యలపై ఒక్కరోజైనా సమీక్షా నిర్వహించని ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అన్నా రు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అయితగోని వెంకన్న, ప్రధాన కార్యదర్శి చాడ హతీష్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement