కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి | - | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

కోదాడ : కోదాడ కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యవస్థాపక సభ్యుడు, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ మదాల వెంకటేశ్వరరావు అలియాస్‌ కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు (81) శుక్రవారం తెల్లవారుజామున అనా రోగ్యంతో మృతి చెందారు. 1968లో ఏర్పాటైన కేఆర్‌ఆర్‌ కళాశాల వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఆయన, అదే కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌ గా 33 ఏళ్ల పాటు పని చేశారు. 2003లో ఉద్యోగ విరమణ అనంతరం ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలను స్థాపించి అందులోనూ అధ్యాపకుడిగా సేవలందించారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.

బీఎల్‌ఓల గౌరవ వేతనం విడుదల చేయాలి

సూర్యాపేట(భానుపురి) : సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణలో బీఎల్‌ఓలుగా విధులు నిర్వహించిన అంగన్‌వాడీ టీచర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్వో ప్రేమ్‌ రాజుకు ఈ మేరకు వినతిపత్రం అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఎల్‌ఓలకు శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని, రానున్న రోజుల్లో అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట సంఘం జిల్లా నాయకులు శ్యామల, అశోక్‌, దంతాల రాంబాబు, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ టీచర్స్‌ యూనియన్‌ సభ్యులు ఆర్‌. స్వప్న, అశ్విని, అనిత, పుష్ప, హేమలత, భాగ్య పాల్గొన్నారు.

డ్రగ్స్‌ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్‌ టీమ్‌ ర్యాలీ

సూర్యాపేట టౌన్‌ : మాదకద్రవ్యాల నిర్మూలన, జాతీయ ఐక్యత, సమగ్రత పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈగల్‌ టీమ్‌ చేపట్టిన చైతన్య ర్యాలీ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు దేశ సమైక్యతను చాటేందుకు ఈ బృందం గుజరాత్‌కు యాత్ర చేపట్టగా శుక్రవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈగల్‌ టీమ్‌ పోలీసు బృందానికి సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్‌, పట్టణ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య ఘనంగా స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో భాగంగా ఈగల్‌ టీమ్‌ గుజరాత్‌లోని సబర్మతి నది తీరంలో ఈ నెల 31న నిర్వహించనున్న జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement