మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

సూర్యాపేట : జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడంతో మార్కెట్‌కు ధాన్యం రాక మొదలైంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 13,479 బస్తాల (8,762 క్వింటాళ్ల) ధాన్యం వచ్చింది. గురువారం 3600 బస్తాల ధాన్యం మాత్ర మే రాగా ఒక్క రోజులోనే 10 వేల బస్తాలకు పైగా ధాన్యం పెరిగింది. దాంతో మార్కెట్‌కు ధాన్యంతో కళకళలాడింది. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో రెండు రోజుల క్రితం నుంచి వరి కోతలు కొనసాగుతుండడంతో రైతులు సూర్యాపేట మార్కెట్‌కు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ఈ నెల 12వ తేదీన 1,021 బస్తాల ధాన్యం రాగా 13న 1,265 బస్తాలు, 14న 2,846 బస్తాలు, 15న 3,600 బస్తాల ధాన్యాన్ని రైతులు తీసుకొచ్చారు. శుక్రవారం అత్యధి కంగా బీపీటీ 9,655 బస్తాలు వచ్చింది. అన్నిరకాలకు క్వింటాకు రూ.3వేలకు పైగా దర పడింది. ఐఆర్‌ –64 రకానికి క్వింటాకు రూ.2,273 గరిష్ఠ ధర పడింది.

అపరాలు సైతం

సూర్యాపేట మార్కెట్‌కు ధాన్యం మాత్రమే కాకుండా అపరాలు సైతం అమ్మకానికి వచ్చాయి. కంది 57 బస్తాలు (37 క్వింటాళ్లు) రాగా గరిష్ఠ ధర రూ.10,022, కనిష్ఠ ధర క్వింటాకు రూ.3,338 పడింది. పెసర్లు 97 బస్తాలు (58 క్వింటాళ్లు) రాగా గరిష్ఠ ధర రూ.7,632, కనిష్ఠ రూ.5,873, వేరుశనగ 63 బస్తాలు (21 క్వింటాళ్లు) రాగా గరిష్ఠ ధర క్వింటాకు రూ.8,409, కనిష్ఠ ధర క్వింటాకు రూ.4,256ల చొప్పున ధర పడింది.

ఫ సూర్యాపేట మార్కెట్‌కు

13,479 బస్తాల ధాన్యం రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement