డెంగ్యూ కలవరం | - | Sakshi
Sakshi News home page

డెంగ్యూ కలవరం

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

లక్షణాలుంటే పరీక్షలు

డెంగీ నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వారా నికి రెండుసార్లు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి శుభ్రం చేయాలి. పారిశుద్ధ్య చర్యలకు సహకరిస్తూ దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా చూడాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.

పెండెం వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ

ఫ వారంరోజుల్లో ఆరు కేసులు నమోదు

ఫ ఈ ఏడాది ఇప్పటి వరకు 76 కేసులు

ఫ వర్షాలు లేకున్నా విజృంభిస్తున్న దోమలు

ఫ అప్రమత్తమైన వైద్యఆరోగ్య శాఖ

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలో డెంగ్యూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుండడం కలవర పెడుతోంది. వర్షాలు కురియక పోయినా దోమల సంఖ్య పెరుగుతోంది. వారంలోనే సూర్యాపేట జిల్లాలో ఐదు డెంగ్యూ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 76 కేసులు నమోదయ్యాయి. గతేడాది మొత్తంగా 151 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే డెంగ్యూ బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు.

బాధితుల ఇళ్ల పరిసరాల్లో సర్వే

జిల్లాలో వారం రోజుల్లో ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఒకటి, హుజూర్‌నగర్‌లో, నేరేడుచర్ల మండలం సోమవారం, అనంతగిరి మండలం న్యూగోల్‌తండా, చింతలపాలెం మండలం నక్కగూడెం, అడ్లూరులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. దాంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డెంగ్యూ వచ్చిన వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న 50 ఇళ్ల పరిధిలో వైద్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా ఇళ్లలో ఎవరికై నా జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వ్యాధి వ్యాప్తిని తొలిదశలోనే గుర్తించి నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రులకు బాధితులు..

జిల్లాలో 23 పీహెచ్‌సీలు, నాలుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. జ్వర పీడితులు ఆయా ఆస్పత్రులకు వచ్చినప్పుడు రక్త పరీక్షలు నిర్వహించి డెంగ్యూ కేసులను నిర్ధారిస్తున్నారు. దాంతో పాటు జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులను సైతం చాలా మంది జ్వర పీడితులు ఆశ్రయిస్తున్నారు. డెంగ్యూ వచ్చిన వారిలో అధిక మంది ప్రైవేట్‌ ఆస్పత్రలకు వెళ్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రుల వారు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అన్ని రకాల ముందులు ఉన్నాయని, రక్త పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు.

వారంలో రెండు రోజులు డ్రైడే...

ఈ సంవత్సరం వర్షాలు కురవక పోయినా దోమల సంఖ్య పెరుగుతూనే ఉంది. దోమల వృద్ధిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో, పరిసరాల్లో పాత్రలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీలు, ఇతర పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచిస్తున్నారు. నీటి తొట్టెలను శుభ్రం చేయడంతోపాటు వాటిని మూతలతో కప్పి ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లు నొప్పులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా మందులు వాడవద్దని, డెంగ్యూ అనే అనుమానం ఉన్నవారు ఆలస్యం చేయకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నా రు. పరిసరాల పరిశుభ్రత, దోమల నియంత్రణలో భాగస్వామ్యం కీలకమని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement