సూర్యాపేటటౌన్ : పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన రూ.20 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 100కు పైగా ఫోన్లను ఒకేసారి అందజేయడం ఇది 15వ సారి అన్నారు. కొన్ని ఫోన్లు ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ సైబర్ వారియర్స్ సాంకేతిక విశ్లేషణతో వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ముఖ్య మైన పత్రాలు ఉంటాయని, వాటిని కోల్పోయిన బాధితుల ఇబ్బందులను గుర్తించి పోలీసులు ప్రత్యే క దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, పిన్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఫ 105 ఫోన్లు పోగొట్టుకున్న
బాధితులకు అందజేత


