సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

సూర్యాపేట : జిల్లాలో ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రానున్న జూలై వరకు ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వాతావరణశాఖ అంచనా ప్రకారం జిల్లాలోని 19 మండలాలలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. తిరుమలగిరి, మద్దిరాల, మట్టపల్లి, మేళ్లచెరువులో మాత్రమే సాధారణ వర్షపాతం కురిసిందన్నారు. ఎల్‌నినో ప్రభావం భూగర్భ జలాలు, తాగునీరు, వ్యవసాయంపై ఎక్కువగా ఉందన్నారు. రైతులు వరి కాకుండా ఉద్యాన పంటలు, పెసర్లు, కందులు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. డిసెంబర్‌ చివరి నాటికి ఎల్‌నినో ప్రభావం తారస్థాయికి చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ, మున్సిపాలిటీలు, పట్టణాలలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి నీటిని పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్వో ప్రేమ్‌రాజ్‌, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఈఓ శ్రీనివాస్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, మిషన్‌ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement