చింతలచెరువు కాలనీలో కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

చింతలచెరువు కాలనీలో కార్డెన్‌ సెర్చ్‌

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

సూర్యాపేట (సూర్యాపేటటౌన్‌) : సూర్యాపేట పట్టణంలోని చింతలచెరువు కాలనీలో బుధవారం రాత్రి పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో 80 మంది పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని 52 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారును గుర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కాలనీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత గంజాయి, బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement