సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట మీదుగా మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంటున్నదని, అలైన్మెంట్ మార్పును వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ సాధనకోసం జిల్లా కేంద్రంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో మంగళవారం ఆయన పాల్గొని మద్దతు తెలిపి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటకు ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేదన్నారు. దీనిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూట్ మార్పునకు ప్రయత్నిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండీ.అబీద్, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కీషన్, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సంకినేని


