తప్పుడు ప్రచారం మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారం మానుకోవాలి

Oct 3 2026 2:02 AM | Updated on Oct 3 2026 2:02 AM

భానుపురి(సూర్యాపేట) : నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలిచిన తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తాను టికెట్‌ అడగలేదని, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేనని, యూటర్న్‌ తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం నా స్పష్టమైన నిర్ణయమని, పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో స్వీకరిస్తున్నానని తెలిపారు. దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల గురించి నేను గతంలో చెప్పిన విషయాలను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదని, పట్టభద్రుల సమస్యలకు బలమైన ప్రాతినిధ్యం వహించడం తన కర్తవ్యం పేర్కొన్నారు. ఇక రెండు పట్టభద్రుల సీట్లు రెడ్లకే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చిందని, అందుకే కాంగ్రెస్‌ అభ్యర్థిని మార్చబోతోందని చేస్తున్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సష్టించే ఊహాగానాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని, పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఫ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి

రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement