నిత్యం.. నిండుకుండే! | - | Sakshi
Sakshi News home page

నిత్యం.. నిండుకుండే!

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

కేతేపల్లి : ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మూసీ రిజర్వాయర్‌ మాత్రం నిత్యం నిండుకుండలా ఉంటోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరుతుంది. 10రోజుల క్రితం మూసీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌లోకి వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642.10అడుగుల (3.71 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండటంతో ఆయకట్టులో యాసంగి పంటకు కూడా ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement