మహనీయుల మార్గం ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

మహనీయుల మార్గం ఆచరణీయం

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

భానుపురి(సూర్యాపేట) : మహనీయులైన మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి మార్గం ఎప్పటికీ ఆచరణీయమని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలలు వేసిఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస, సత్యగ్రహం అనే ఆయుధాల ద్వారా గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. దేశ రక్షణ, ఆహార భద్రతలో రైతులు, సైనికుల పాత్రను గుర్తించి జై జవాన్‌–జై కిసాన్‌ నినాదాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి సేవలు చిరస్మరణీయమన్నారు. వారు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ బి.హరిసింగ్‌, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్‌, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఉపేందర్‌రావు, ఆడిట్‌ ఆఫీసర్‌ శ్యామ్‌సుందర్‌ ప్రసాద్‌, డీసీఓ శ్రీరామ్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్రీధర్‌రెడ్డి, డీబీసీడీఓ విశాల్‌, ఫిషరీస్‌ ఏడీ ఆంజనేయశర్మ, అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement