ఖైదీల ప్రవర్తనలో మార్పు రావాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీల ప్రవర్తనలో మార్పు రావాలి

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీలు ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని, సమాజంలో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి పి.శివరామ్‌ ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా సబ్‌ జైలులో ఖైదీలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుట్టుకతో ఎవరూ నేరస్తులు కారని, చెడు వ్యసనాలు, తప్పుడు నిర్ణయాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. దీనిని తమ జీవితంలో మార్పుగా భావించి, ప్రవర్తనను, అలవాట్లను మార్చుకుని, ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. అనంతరం ఖైదీలకు పలు రకాల ఆటవస్తువులు అందజేసి పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య, జైలు సూపరిండెంట్‌ బి.సుధాకర్‌రెడ్డి, బార్‌ అసోషియేషన్‌ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్‌, డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్‌ సభ్యుడు జి.మధు, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఫ జిల్లా మొదటి అదనపు జడ్జి శివరామ్‌ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement