బతుకమ్మ చీరలొచ్చాయ్‌ | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరలొచ్చాయ్‌

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

ముందస్తుగానే చీరలు

భానుపురి(సూర్యాపేట) : బతుకమ్మ పండుగకు మహిళలు చిలుక పచ్చరంగులో మెరిసిపోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఏటా అందించే చీరలు ఈ సారి చిలుక పచ్చ రంగులో వచ్చేశాయి. పండుగ మరో 20 రోజులు ఉండగానే ముందస్తుగా జిల్లాకు ఇప్పటికే సగానికి పైగా చీరలు వచ్చాయి. మిగతా చీరలు త్వరలోనే రానున్నాయని అధికారులు చెబుతున్నారు. సద్దుల బతుకమ్మకు రెండ్రోజుల ముందుగానే పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో 1,90,000 మంది మహిళలు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచి మహిళలకు ఉచితంగా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు పండుగ కానుకగా చీరలను ఇవ్వాలని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో రేషన్‌ కార్డులో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలను అందించారు. ఈ చీరలు నాణ్యతగా లేకపోవడంతో మహిళలు అంతగా ఇష్టపడలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చీరల నాణ్యత పెంచి మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి పంపిణీ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 1.90 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు.

పాలపిట్ట రంగు నుంచి..

పథకాన్ని ప్రారంభించిన సమయంలో వివిధ రకాల డిజైన్లలో మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. అయితే ఈ చీరల నాణ్యత సరిగా లేకపోవడంతో మహిళలు వాడుకోవడానికి ఇష్టపడలేదు. ఈ క్రమంలో గతేడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఒకేవిధమైన నాణ్యత గల చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాలపిట్ట రంగు చీరలను అందించారు. ఈసారి అందరికీ చిలుక పచ్చ రంగు చీరలు అందించాలని డిజైన్‌ చేయించింది.

మహిళలకు పండుగ కానుక

ఫ ఇప్పటికే జిల్లాకు చేరిన

85 వేల చీరలు

ఫ త్వరలో రానున్న మరో 1.10 లక్షలు

ఫ రెండ్రోజుల ముందే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

సెప్టెంబర్‌ చివరి నాటికి చీరలను సరఫరా చేసి పండుగకు రెండు, మూడు రోజుల ముందు పంపిణీ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనుకున్న దానికి వారం రోజులు ముందుగానే జిల్లాకు 85,145 చీరలు చేర్చారు. వీటిని హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో గల ఓ గోదాంలో నిల్వ ఉంచారు. ఇంకా 1,10,000 చీరలు జిల్లాకు చేరిన తర్వాత ఆయా గోదాముల నుంచి మండల సమైక్యలకు అందించనున్నారు. అక్కడి నుంచి గ్రామస్థాయిలో ఉండే వీఓఏల ద్వారా మహిళలందరికి పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సద్దుల బతుకమ్మకు రెండు మూడు రోజుల ముందే పూర్తయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement