మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ముందుగా శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేసి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం గావించారు. ఆ తర్వాత ఎదుర్కోలు మహోత్సవం, నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతోపాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఆలయాలకు రెండెకరాల భూమి విరాళం
కోదాడరూరల్ : మండలంలోని గుడిబండలో యరగాని గాంధీ జ్ఞాపకార్థం ఆయన భార్య సులోచన, వారి కుమారులు యరగాని రామయ్య, రమేష్‌లు గ్రామంలోని సీతారామా ంజనేయ, శ్రీఆంజనేయస్వామి ఆలయాలకు ఒక్కో ఎకరం చొప్పున రెండు ఎకరాలను భూమిని విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ నిర్వాహకులకు భూ పత్రాలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టీపీసీసీ సభ్యుడు సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ తండ్రి జ్ఞాపకార్థం ఆయన కుమారులు లక్షల విలువ చేసే భూమిని ఆలయాలకు విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు యరగాని లక్ష్మయ్య, సర్పంచ్ మందుల నాగయ్య, ఇర్ల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిందు సేద్యం పద్ధతులపై రైతులకు అవగాహన
గరిడేపల్లి : రైతులు బిందు సేద్యం పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఏపీలోని ఏలూరుకు చెందిన సెయింట్ థెరిస్సా అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామంలో శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) గడ్డిపల్లి ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా రైతులకు సూక్ష్మ సాగునీటి పద్ధతిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నీటిని ఎక్కువగా పోయడం కంటే, మొక్కకు అవసరమైన నీటిని సరైన సమయంలో, సరైన పరిమాణంలో వేర్ల దగ్గరికి అందించడమే సూక్ష్మ సాగునీటి పద్ధతి ముఖ్య ఉద్దేశం అని రైతులకు వివరించారు. రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు సీహెచ్.తనుశ్రీ, పి.జ్యోతి, సీహెచ్.కీర్తి, ఎస్.కె.హబీదా, టి.తేజస్వి లక్ష్మి, డి.డైనా తదితరులు పాల్గొన్నారు.


