● డీసీసీ అధ్యక్షుడు
గుడిపాటి నర్సయ్య
సూర్యాపేట అర్బన్ : దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ముందుకెళ్దామని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి. షఫీ ఉల్లా అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో జమ్మిగడ్డలో రాజీవ్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతిఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల వాసు, చిలుముల సునీల్ రెడ్డి, తన్వీర్ హుసేన్, ఎస్‌కె.జహీర్, ఎలిమినేటి అభినయ్, వీరన్న నాయక్, పారూక్, పోలగాని బాలు గౌడ్, కమ్మరికుంట్ల లింగయ్య, కోడి శివ, బండారు వెంకన్న, గడ్డం వెంకన్న, సాజిద్, అక్కినపల్లి జానయ్య, రుద్రంగి రవి, కరుణాకర్‌రెడ్డి, పడిదల రవి తదితరులు పాల్గొన్నారు.


