సూర్యాపేట : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ కోసం పోరుబాటకు సిద్ధం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ కమిటీ వేసి మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదన్నారు. 30 శాతం ఫిట్‌మెంట్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, వెంటనే ఈహెచ్‌ఎస్ కార్డులు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానమైన డిమాండ్లతో సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాశాఖ మాజీ అధ్యక్షుడు కొండేటి రవీందర్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ బొల్లికొండ కోటయ్య, అకాడమిక్ కమిటీ వైస్ చైర్మన్ చల్ల ప్రభాకర్‌రెడ్డి, మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడు పప్పుల వీరబాబు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కందుకూరి శివశంకర్, అకడమిక్ కమిటీ సభ్యుడు రాపర్తి వీరేష్, జిల్లా గౌరవాధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు, ఏఐఎఫ్టీఓ ఉపాధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్, మేడ్చల్ అధ్యక్షుడు రామేశ్వర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి


