నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణకు దరఖాస్తులు

Aug 18 2026 8:04 AM | Updated on Aug 18 2026 8:04 AM

నల్లగొండ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరం నీట్‌ ఉచిత లాంగ్‌టర్మ్‌ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్‌ శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న బాలురకు హైదరాబాద్‌లోని చిలుకూరు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ ఫౌండేషన్‌ సీఓఈలో, బాలికలకు మహేంద్రహిల్స్‌ కేంద్రంలో ఉచితంగా నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ బైపీసీ పూర్తి చేసి, నీట్‌ (యూజీ)–2026 పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తుకు నీట్‌–2026 స్కోర్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలను జత చేయాలని, పూర్తి చేసిన దరఖాస్తులను టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జేసీ (బాలికల) నకిరేకల్‌ (డీసీఓ), నకిరేకల్‌, నల్లగొండ జిల్లా–508211 చిరునామాకు ఈ నెల 22వ తేదీలోగా పంపాలని సూచించారు.

సిమెంట్‌ లారీ బోల్తా

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బోరింగ్‌తండా వద్ద సోమవారం తెల్లవారుజామున సిమెంట్‌ లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి కాళేశ్వరానికి వెళ్తున్న సిమెంట్‌ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సంజయ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

తీజ్‌ పండుగకు వచ్చి

మృత్యుఒడికి..

బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి

చందంపేట : తీజ్‌ పండుగకు స్వగ్రామానికి వచ్చిన యువకుడు బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం కేతేపల్లి గేటు వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్‌ గ్రామానికి చెందిన కేతావత్‌ దేవ్‌సింగ్‌(25) హైదరాబాద్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల తీజ్‌ పండుగకు స్వగ్రామానికి వచ్చిన దేవ్‌సింగ్‌ సోమవారం మరో ఇద్దరితో కలిసి బైక్‌పై నేరెడుగొమ్ము నుంచి చిన్నమునిగల్‌కు వెళ్తుండగా.. చందంపేట మండలం కేతేపల్లి గేటు వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డు సైడ్‌ వాల్‌కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవ్‌సింగ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై ఉన్న మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పండుగకు ఇంటికి వచ్చిన దేవ్‌సింగ్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement