ఆత్మకూరు(ఎం) : పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రివేళ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ఆత్మకూరు(ఎం) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌కు చెందిన బండారి దుర్గాప్రసాద్, బండారి సాయి ముఠాగా ఏర్పడ్డారు. వారు డి పగలు గ్రామాలకు చివరన ఉన్న దేవాలయాలను గుర్తించేవారు. రాత్రివేళ వారు దేవాలయాల్లోని ఇత్తడి గంటలు, పూజా సామగ్రి చోరీ చేసేవారు. ఇలా వలిగొండ, ఆత్మకూరు(ఎం), మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చాలా దొంగతనాలకు పాల్పడ్డారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం తిమ్మాపురం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. టీవీఎస్ ఎక్సెల్‌పై అనుమానాస్పదంగా వస్తున్న వారిద్దరిని ఆపారు. ఈ క్రమంలో బండారి సాయి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. బండారి దుర్గాప్రసాద్‌ను విచారించగా.. ఆలయాల్లో ఇత్తడి గంటలు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.11,200 నగదు, టీవీఎస్ ఎక్సెల్, ఇత్తడి గంటలు, పూజా సామగ్రి, నేరాలకు ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బండారి సాయి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడ్డ బండారి దుర్గాప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయాల్లో ఇత్తడి గంటలు
అపహరిస్తున్న దొంగ అరెస్టు
మరొకరు పరారీ


