
అనుమతులు రద్దు చేయడం అప్రజాస్వామికం
సూర్యాపేట అర్బన్ : వరంగల్‌లో ఆదివాసీల హక్కుల వేదిక, ప్రజా సంఘాల వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు రద్దు చేయడం అప్రజా స్వామికమని ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ భద్రయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగే సభకు అనుమతులు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో వెంకటయాదవ్, మాధవరెడ్డి, లింగయ్య, సత్యనారాయణ, నరసయ్య, నాగయ్య, పిడమర్తి భరత్, దేశోజు మధు పాల్గొన్నారు.