
ఇన్‌సై్పర్ మనక్‌పై అనాసక్తి!
అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలి
విద్యాసంస్థల వివరాలు ఇలా
పలు అంశాలపై ప్రాజెక్టులు..
తిరుమలగిరి( తుంగతుర్తి ): విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాల వైపు మళ్లించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని శాస్త్ర, సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతియేటా ఇన్‌స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తోంది. దీనికి జిల్లాలో ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. గతనెల 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతేడాది 676 దరఖాస్తులొస్తే ఈసారి ఇప్పటి వరకు 126 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సెప్టెంబరు 15వ తేదీ లోగా ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో నామినేట్ చేయడానికి అవకాశముంది.
ప్రత్యేక కమిటీలు ఏర్పాటు
ఇన్‌స్పైర్ మనక్‌కు సంబంధించి గత నెలలో అప్‌లోడ్ ఎలా చేయాలో సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. దరఖాస్తు చేయించేందుకు మండల స్థాయిలో సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. దరఖాస్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..
సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించేందుకు గడువు ఉంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ఉన్నత పాఠశాల నుంచి ఐదు, యూపీఎస్ నుంచి మూడు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్లో భాగంగా విద్యాలయాల వివరాలు పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి వాటికి ఆమోదం లభించిన తర్వాత ఈమెయిల్ ఐడీ, లింకు లభిస్తాయి. వాటి సాయంతో పాస్‌వర్డ్ నమోదు చేసుకోవాలి. అనంతరం ప్రాజెక్టు నమూనాకు సంబంధించి పూర్తి వివరాలు అప్ లోడ్ చేయాలి.
ఫ ఇప్పటివరకు దరఖాస్తులు
సమర్పించింది 126 మంది మాత్రమే
ఫ గతనెల 1న ప్రక్రియ ప్రారంభం కాగా.. వచ్చేనెల 15న ముగియనున్న గడువు
ఫ ఇప్పటికే మండల స్థాయిలో
సీనియర్ సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు
ఫ దరఖాస్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేసినా కనిపించని ఫలితం
ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భావిశాస్త్రవేత్తలు ఎదగడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారి
ఉన్నత పాఠశాలలు: 184
ప్రాథమికోన్నత పాఠశాలలు : 84
జూనియర్ కళాశాలలు : 08
డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, సమా జాభివృద్ధి– క్లీన్ ఇండియా తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికై న నమూనాను ప్రదర్శించడానికి రూ.10 వేలను ప్రోత్సాహకంగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపికై తే వాటిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడి నుంచి జాతీయస్థాయికి ఎంపికై న నమూనాల రూపకర్తలకు ప్రభుత్వం పేటెంట్ హక్కు కల్పిస్తుంది. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులను మరింత మెరుగైన విధంగా తయారు చేయడానికి కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మరో రూ.25 వేలు ఇస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్‌లో అభినందనలు, అతిథ్యంతోపాటు పేరొందిన శాస్త్రవేత్తలతో కలిసి పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జపాన్ వరకు వెళ్లి నోబెల్ శాస్త్రవేత్తలను కలుసుకునే సువర్ణావకాశం లభిస్తుంది.