
అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించొద్దు
తుంగతుర్తి : ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఆస్పత్రిని తనిఖీ చేసి మాట్లాడారు. ఆర్‌ఎంపీ బండి శ్రీనివాస్ గదిలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ డాక్టర్ల నేమ్ స్టాంప్స్‌లు, కన్సల్టెన్సీ డాక్టర్ల పేరుతో గల ఐడీ కార్డులు, లెటర్ ప్యాడ్స్, ఆపరేషన్ కోసం వాడుతున్న యాంటీబయాటిక్ మందులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ జయ, డాక్టర్ నజియా, డాక్టర్ జి చంద్రశేఖర్, రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య అధికారి డాక్టర్ లింగమూర్తి ఉన్నారు.
30, 31 తేదీల్లో
శిక్షణ తరగతులు
సూర్యాపేట : ఈ నెల 30, 31 తేదీల్లో మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు కోరారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగం బలోపేతానికి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిన విద్యార్థుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జిల్లా ఉపాధ్యక్షుడు పిడమర్తి భరత్, జిల్లా నాయకులు బోర లెనిన్, సంతోష్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ జిల్లా
అధ్యక్షుడిగా స్టాలిన్
సూర్యాపేట : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన మామిడి స్టాలిన్ నియామకమయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నట్లు బుధవారం ఆయన తెలిపారు. స్టాలిన్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆత్మగౌరవ సభకు తరలిరావాలి
సూర్యాపేట : సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ఆత్మ గౌరవసభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు రిటైర్‌మెంట్ అనంతరం వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో జీవించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శిరందాసు రామదాసు, జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజు, టీజీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, జానయ్య, శివమూర్తి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించొద్దు

అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించొద్దు

అనుమతి లేకుండా ఆస్పత్రులు నిర్వహించొద్దు