
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మునగాల: గ్రామాల్లో ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో పలు వీధులు, మురుగు కాలువలను పరిశీలించారు. ఇంటి ముందు ఇంకుడు గుంతల లేకుండా ఇళ్లలో వాడుకున్న నీరు వీధుల్లో ప్రవహించడాన్ని గమనించి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జ్వరాల బారిన పడిన పలువురిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. పలు వీధులు లోతట్టు ప్రాంతంలో ఉండడం, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, పరిసరాల పరిశుఽభ్రత లోపించడం, కొన్నిచోట్ల చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయడం, జనావాసాల మధ్య పిచ్చిమొక్కలు పెరగడం, ఇంకుడు గుంతలు లేకపోవడాన్ని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రతి వీధిలో డెమోపాస్ స్ప్రే, బ్లీచింగ్ చల్లాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. ఇందు కోసం రూ.50వేల చెక్కును ఎంపీడీఓకు అందజేశారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పైలెట్ గ్రామంగా ఎంపికై న తాడువాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, తహసీల్దార్ చంద్రశేఖర్, వైద్యాధికారులు శ్రీశైలం, వినయ్‌కుమార్, వైష్ణవి, పంచాయతీ కార్యదర్శి రాము, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ తాడువాయిలో పర్యటించిన కలెక్టర్

పరిసరాల పరిశుభ్రత పాటించాలి