టెండర్‌ ఫీజు రూ.3 లక్షలు | - | Sakshi
Sakshi News home page

టెండర్‌ ఫీజు రూ.3 లక్షలు

Aug 21 2025 7:04 AM | Updated on Aug 21 2025 7:04 AM

టెండర్‌ ఫీజు రూ.3 లక్షలు

టెండర్‌ ఫీజు రూ.3 లక్షలు

స్లాబ్‌ల వారీగా చెల్లించాల్సిన ఫీజులు

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

సూర్యాపేటటౌన్‌ : కొత్త మద్యం దుకాణాల (వైన్స్‌)కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్‌ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్‌ 30తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2025 మద్యం టెండర్‌ విధానాన్ని ప్రకటించింది. 2025 డిసెంబర్‌ 1నుంచి 2027 నవంబర్‌ 30 వరకు రెండేళ్ల కాలపరిమితికి టెండర్‌ ఫీజు ఖరారు చేసింది. ఈ సారి మద్యం దుకాణం టెండర్‌ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్‌ ఫీజు ఒక్కటే పెంచిన ప్రభుత్వం మిగతా విధానాలు పాత పద్ధతుల్లోనే కొనసాగించేందుకు సిద్ధమైంది. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. జిల్లాలోని 23 మండలాలకు సంబంధించి 99 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో సూర్యాపేట సర్కిల్‌లో 30 దుకాణాలు, తుంగతుర్తి సర్కిల్‌లో 17, కోదాడలో 24, హుజూర్‌నగర్‌ సర్కిల్‌లో 28 దుకాణాలు ఉన్నాయి.

రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయింపు..

మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్‌ విధానం అమలు చేయనున్నారు. ఈసారి రిజర్వేషన్లు 30 శాతంగా నిర్ణయించారు. అందులో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఆయా దుకాణాలకు జనాభా ప్రాతిపదికన రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్‌లలో లైసెన్స్‌దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

త్వరలోనే నోటిఫికేషన్‌

ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీ కోసం సెప్టెంబర్‌ 2వ వారంలోపే షెడ్యూల్‌ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నెలలో దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన పూర్తిచేసి అక్టోబర్‌లో డ్రా పద్ధతిన దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎకై ్సజ్‌ శాఖ కమిషన్‌ ఆదేశాల మేరకే దుకాణాల లైసెన్స్‌ల జారీకి దరఖాస్తుల షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

లాటరీ పద్ధతిన ఎంపిక..

మద్యం దుకాణాలను గతంలో మాదిరిగానే ఈ సారి కూడా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు తీసుకుని పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన దరఖాస్తులను ఆయా మద్యం దుకాణాల వారీగా డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్‌ డ్రా తీస్తారు.

ఫ 5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు

ఫ 5 వేల నుంచి 50వేల

జనాభాకు రూ.55 లక్షలు

ఫ 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60లక్షలు

ఫ లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65లక్షలు

ఫ 5 లక్షల నుంచి 20 లక్షల

జనాభాకు రూ.85లక్షలు

ఫ 20 లక్షల పైచిలుకు జనాభాకు రూ.1.10కోట్లు

మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం

ఫ గతంలో రూ.2లక్షలు.. ఈ సారి

అదనంగా మరో రూ.లక్ష పెంపు

ఫ డిసెంబర్‌ 1నుంచి 2027 నవంబర్‌ 30 వరకు కాలపరిమితి

ఫ గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు

10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వుడ్‌

ఫ జిల్లా వ్యాప్తంగా 99 వైన్స్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement