
విద్యార్థి భవితకు ‘విజ్ఞాన్ మంథన్’
ఉపకార వేతనాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సైన్స్‌పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు శ్రీవిద్యార్థి విజ్ఞాన్ మంథన్‌శ్రీ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందజేస్తోంది. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షలో పాల్గొనేందుకు అర్హులు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. పరీక్ష రుసుం రూ.200 చెల్లించాలి. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం
ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలు జూనియర్, సీనియర్ విభాగాలుగా నిర్వహిస్తారు. 6 నుంచి9వ తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 14 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. టెలిఫోన్, ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్ దేనినైనా వినియోగించుకోవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయోలజీ 50 శాతం, భారతదేశం కృషిపై 20, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20, లాజికల్ రీజనింగ్‌పై 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్లకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు, సీనియర్లకు నవంబర్ 19 నుంచి 23 తేదీల్లో వారికి నచ్చిన రోజు పరీక్ష రాయొచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయి, జనవరి 30న జాతీయ స్థాయి పోటీలు ఉంటాయి.
ఫ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాల అందజేత
ఫ 6వ తరగతి నుంచి ఇంటర్
చదివే విద్యార్థులకు అవకాశం
ఫ వచ్చేనెల 30లోపు ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల స్వీకరణ
ఫ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో
ముగ్గురికి నగదు బహుమతులు
ఫ ఏడాదిపాటు రూ.2వేల చొప్పున ‘ఉపకారం’
పాఠశాల స్థాయిలో 18 మందిని ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున గుర్తిస్తారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా ఇస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురికి రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశంతోపాటు ఏడాది పాటు నెలకు రూ.2వేల ఉపకార వేతనం అందజేస్తారు.