
వీడని వరద.. తీరని వ్యథ!
సూర్యాపేట అర్బన్ : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పలు ప్రాంతాలు ముంపు బారిన పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో ఇళ్ల చుట్టూ, వరిపొలాల మీదుగా వరదనీరు పారుతోంది. మళ్లీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువు, పిల్లలమర్రి చెరువు అలుగు పోస్తున్నారు. ఆయా చెరువుల వరదంతా పట్టణంలోని ఎస్వీ కాలేజీ వెనుక నుంచి ప్రియాంక నగర్, ఆర్‌కే గార్డెన్ మీదుగా ఎస్పీ ఆఫీస్ దగ్గర గల ఈదులవాగు నుంచి నల్ల చెరువులోకి చేరుతోంది. ఆయా కాలనీలను వరద వదలడం లేదు. ఫలితంగా ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరద ముప్పు తప్పేలా శాశ్వత పరిష్కారం చూడాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమలగిరి, మోతె, ఇతర మండలాల్లోనూ చెరువులు అలుగు పోస్తూ వరిపొలాలను ముంచెత్తుతున్నాయి.
ఫ అలుగు పోస్తున్న చెరువులు
ఫ సూర్యాపేటలో పలు కాలనీలు
జలమయం
ఫ ఇతర మండలాల్లో నీట మునిగిన వరిపొలాలు

వీడని వరద.. తీరని వ్యథ!

వీడని వరద.. తీరని వ్యథ!