
ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేయాలి
సూర్యాపేట అర్బన్ : కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని వీఎన్ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా కె.చైతన్య, ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ వర్మ, కోశాధికారిగా ఎస్.రమేష్, ఉపాధ్యక్షుడిగా ఎన్.జానయ్య, సహాయ కార్యదర్శిగా త్రివేణి, పలువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నెమ్మాది మాట్లాడారు.