
సాగర్‌కు స్వలంగా తగ్గిన వరద
ఫ 14గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్: ఎగువ నుంచి సాగర్‌కు వరద స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా 26గేట్లను ఎత్తిన అధికారులు.. శుక్రవారం 14గేట్లకు తగ్గించి నీటిని విడుదల చేస్తున్నారు. వద్ద పద్నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 1,44,694 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి 14 గేట్ల నుంచి, విద్యుదుత్పాదనతో కలిపి 1,38,244 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.90 అడుగులు ఉంది.