77 ఏళ్లుగా మువ్వన్నెల రెపరెపలు
రాజాపేట: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతాంగ సాయుధ పోరాటం తర్వాత 1948 సెప్టెబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో రాజాపేట మండలం బేగంపేట గ్రామం నడిబొడ్డున అదే గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 ఏళ్లుగా బేగంపేట గ్రామం నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు అనుసరిస్తూ నిరంతరాయంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కలిసి ఆ జెండా ఎగురవేసే ప్రదేశంలో 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతో పాటు భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15వ తేదీ, దసరా పండుగ రోజున పాత జెండాను మార్చి నూతన జెండాను ఎగురవేస్తూ జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశ వ్యాప్తంగా 79 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలోనూ స్వేచ్ఛ సమానత్వం లేకుండాపోయిందని నేటి యువతరం వాపోతోంది. సమాజంలో అవినీతి, పేదరికం ఇంకా ప్రధాన సమస్యగానే ఉన్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. ప్రజలు, ముఖ్యంగా యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, స్వేచ్చ, సమానత్వం అందుతున్న తీరు, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ఏం చేయాలన్న అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. 90 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా సమాజంలో ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అవినీతి పేదరికం కొనసాగుతోందని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పనిచేయాలని, చట్టసభలు సమర్థవంతంగా వ్యవహరించాలని, న్యాయ వ్యవస్థ మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో మీడియా పాత్ర ప్రధానమేనని వివరించారు.
బేగంపేట గ్రామంలో నిరంతరాయంగా ఎగురుతున్న జాతీయ పతాకం
మీడియా
కులవివక్ష
6
చట్టసభలు
అధికార
యంత్రాంగం
21
న్యాయ వ్యవస్థ
39
24
కొద్దిగా
లేదు
అవును
78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత..
1. మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ?
ఫ అవినీతి, పేదరికమే అసలు సమస్య
ఫ అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతోనే మేలు
ఫ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే..
‘సాక్షి’ సర్వేలో యువత మనోగతం
3. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏదీ?
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..