
అవినీతి లేని దేశంగా మారాలి
స్వాతంత్య్రం వచ్చి 79ఏళ్లు అవుతున్నా దేశంలో అవినీతి తగ్గడం లేదు. పొలిటికల్ పార్టీలు అధికారంలోకి రాగానే వారి అండదండలతో అధికారులు అవినీతిపరులుగా మారుతున్నారు. అవినీతి రహితంగా మారినప్పుడే భారతదేశం ప్రపంచంలో ఇంకా ముందంజలో ఉంటుంది. అలాంటి వ్యవస్థ ఏర్పడాలి.
– ఎం.కల్యాణి, ఇంజనీరింగ్ విద్యార్థిని
మహిళల రక్షణకు పటిష్టమైన
చట్టం చేయాలి
దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు అత్యాచారాలు, కిడ్నాప్‌లకు గురవుతున్నారు. దీంతో ఆడపిల్ల బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. దేశంలో మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలి.
– లలిత, ఇంజనీరింగ్ విద్యార్థిని
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం ఐటీ హబ్‌లను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మేము భవిష్యత్‌లో ఈ దిశగా కృషి చేస్తాం. – వినూత్న, ఇంజనీరింగ్ విద్యార్థిని
వందేళ్లకు చేరువలో ఉన్న భారతదేశంలో మరింతగా పోలీస్ సంస్కరణల అమలు జరగాలి. పోలీస్ శాఖను రాజకీయ ఒత్తిడుల నుంచి దూరంగా ఉంచాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి సత్వర న్యాయం జరిగేలా చూడాలి. నాణ్యమైన విద్య, వైద్యం వీలైనంత తక్కువ ధరకు ప్రభుత్వమే అందించాలి. ఉచిత వైద్యం, విద్య పేరిట నాసిరకంగా సేవలు వెంటనే ఆపేయాలి. – సాయితేజ, ఇంజనీరింగ్ విద్యార్థి

అవినీతి లేని దేశంగా మారాలి

అవినీతి లేని దేశంగా మారాలి

అవినీతి లేని దేశంగా మారాలి

అవినీతి లేని దేశంగా మారాలి

అవినీతి లేని దేశంగా మారాలి