
ఒకే మాట.. ఒకటే బాట
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాల నిషేధం కఠినంగా అమలవుతోంది.
అల్లందేవిచెర్వు గ్రామం నుంచి ప్రారంభం..
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరేళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. బెల్టుషాపులు మూసివేసి మద్యం అమ్మకాలను నిషేధించిన గ్రామాల అభివృద్ధి కోసం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రూ.5లక్షలు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా గ్రామంలో బెల్టుషాపులను మూసివేసి, మద్యం అమ్మకాలను నిషేధించారు. ఆ తర్వాత చిమిర్యాల గ్రామస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ రెండు గ్రామాల స్ఫూర్తితో గ్రామాగ్రామాన బెల్టుషాపుల మూసివేత పోరాటం కొనసాగింది. మద్యం అమ్మకాలు నిషేధించిన అల్లందేవిచెర్వు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఐదేళ్ల కిందట రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేశారు. ఆ నిధులతో గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టారు.
గ్రామస్తుల సహకారంతో అమలు చేశా
ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామస్తుల సహకారంతో మద్యం అమ్మకాలను నిషేధాన్ని కఠినంగా అమలు చేశాం. దీంతో మా గ్రామానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు నిధులు ఇవ్వడంతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించుకున్నాం.
– సుర్వి యాదయ్య, మాజీ సర్పంచ్

ఒకే మాట.. ఒకటే బాట