‘బ్రేకింగ్ న్యూస్.. పలాస జెడ్పీటీసీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి బి.దుర్యోధనరావుకు భారీ షాక్. ఎన్నికల కోసం దొడ్డిదారిన తెచ్చిన రూ. 70లక్షలు పట్టివేత. అతని సమీప బంధువు, చినంచల సర్పంచి అభ్యర్థి ఇంట్లో స్వాధీనం. జిల్లాలో హాట్ టాపిక్.’ అంటూ పలాసకు చెందిన టీడీపీ సోషల్ మీడియా పేజీలన్నీ ఊదరగొట్టేశాయి. ఈ సందేశాలు వెలువడిన అరగంట తర్వాత పోలీసులు ముకుందరావు ఇంటికి తనిఖీలకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు చెప్పకుండా నగదు ప్రస్తావించడం, తనిఖీలు జరుగుతుండగానే సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టింగ్లు కనిపించడం అనుమానాలకు తావిచ్చింది.


