కొత్తూరు మండలంలోని సిరుసువాడ– కుంటిభద్ర రోడ్డు పనులను గత ఏడాది మార్చి 27 తేదీన ప్రారంభించారు. ఈ రోడ్డు కోసం రూ.2 కోట్లు అంచనా వేసి రూ.75 లక్షలు ఖర్చు చేశారట. ఏడాదిన్నర తిరిగేసరికి రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. రోడ్డు మీద మెటల్ తేలిపోవడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – కొత్తూరు
పొగిరి–జి.సిగడాం గ్రామాల మధ్యలో రహదారి
జి.సిగడాం నుంచి పలు గ్రామాలకు వెళ్లాలంటే ప్రహసనంలా మారుతోంది. జి.సిగడాం నుండి వెంకయ్యపేట, జాడ నుంచి జగన్నాథవలస సేతుభీమవరం నుంచి గెడ్డకంచరాం, పొగిరి నుంచి జి.సిగడాం గ్రామాల మద్య భారీ గోతులు ఏర్పడ్డాయి. చినుక పడ్డా, చీకటి పడినా ఇటువైపుగా రాలేం. జి.సిగడాం–పొగిరి గ్రామాల సమీపంలో రెండు అడుగుల లోతులో భారీగా గోతులు కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. – జి.సిగడాం
ముౖప్పె గ్రామాలకు ప్రధాన రహదారి అయిన నరసన్నపేట–జలుమూరు రోడ్డులో ఓ భాగమిది. నరసన్నపేట నుంచి కంబకాయ వరకు రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఎక్కడికక్కడ గోతులు, రాళ్లు తేలి నడిచేందుకు ఇబ్బందిగా ఉంది. వానలకు రోడ్డు మరింతగా శిథిలమైంది. నిధులు వచ్చాయని చెబుతున్నారు తప్ప పనులు చేసిన దాఖలాలు లేవు. – నరసన్నపేట


