అరసవల్లి: బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలను ఈనెల 1 నుంచి 7వ తేది వరకు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ నరేష్‌కుమార్ తెలియజేసారు. ఈమేరకు సోమవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి ..ఏడు రోజుల కార్యక్రమ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఇంధన పొదుపు అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ఆయన ప్రకటించారు. సుస్థిర జీవన శైలిలో ఆచరణలో పెట్టాల్సిన ఏడు అంశాలను ఏడు రోజుల్లో అవగాహన కల్పించేలా షెడ్యూల్‌ను జిల్లాలో అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో అమలు చేయాలని తద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.


