వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు..! | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు..!

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

సంతబొమ్మాళి: మండలంలోని చిన్నతుంగాం పంచాయతీ పెద్ద తుంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అంగ మోహన్‌రావుతో పాటు సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో సోమవారం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి ఆధ్వర్యంలో వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జోరువానలో కూడా పార్టీలో చేరికలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగనన్నతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పార్టీలో చేరినవారు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కాని జగ్గారావు, తంగి బాబురావు, కాపు గోదాయవలస మాజీ సర్పంచ్‌ అంగ లక్ష్మి జనార్థన్‌, అంగ మల్లేశు, కె.కిరణ్‌, వెంకటరమణ, బాలక రామారావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ మండలాధ్యక్షుడి భార్య చేరిక

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని పాయితారి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం భార్య లోపింటి లక్ష్మీ తన అనుచరులతో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం కొళిగాం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి లోపింటి భారతీ దీనబందు ఆధ్వర్యంలో బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర పార్టీ కండువా వేసి లోపింటి లక్ష్మీని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నచ్చక వైఎస్సార్‌సీపీ పార్టీలో తన అనుచరులతో కలిసి చేరుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆశి కృష్ణారెడ్డి, బొబ్బిలి దేవరాజు, వలపల వెంకటమరణ తదితరులు పాల్గొన్నారు.

నరసన్నపేట: మండలంలోని నర్శింగరాయుడుపేటకు చెందిన బీజేపీ నాయకుడు ముద్దాడ సింహాచలం వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం సాయంత్రం మబగాంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ సింహాచలంకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీటీసీ అభ్యర్థి పంచిరెడ్డి సత్యం ప్రోత్సాహంతో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ముద్దాడ సింహాచలం ప్రకటించారు. ఈయన చేరికతో కొత్తపోలవలస పంచాయతీలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement