కబ్జాల కూటమి | - | Sakshi
Sakshi News home page

కబ్జాల కూటమి

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

నరసన్నపేటలో చెరువులు కనుమరుగు

నరసన్నపేట నియోజకవర్గంలో రాజుల చెరు వు, నరసన్న చెరువు, రాతికర్ర చెరువు, పాలకర్ర చెరువు ఇప్పటికే ఆక్రమణకు గురవ్వగా తాజాగా సత్యవరం పరిధిలోని సర్వే నంబర్‌ 412/4లో గల 1.55 ఎకరాల విస్తీర్ణం గల వట్టి బసవన్న చెరువును కళ్లముందే చదును చేసి, కబ్జా చేసేస్తున్నారు. జేసీబీతో చెరువును చదును చేయడమే కాకుండా ఆ చెరువుకు ము రుగునీరు, వర్షపు నీరు వచ్చే డ్రైన్‌ మార్గాన్ని కప్పేశారు.

అధికారం ఇచ్చింది భూకబ్జాలకా?

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చెరువులను మింగేస్తున్నారు..గెడ్డలను తినేస్తున్నారు..దేవదాయ శాఖ భూమి కనబడితే ఎగబడుతున్నారు.. ప్రభుత్వ స్థలాలను సొంత స్థలాల్లా అనుభవిస్తున్నారు. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. భూ దందాతో వందల కోట్లు సంపాదిస్తున్నారు. అవినీతి అధికారులతో చేతులుకలిపి పత్రాలు మార్చి జనాలను, యజమానులను ఏమారుస్తున్నారు.

పలాసలో ముఠాగా ఏర్పడి..

పలాస నియోజకవర్గంలో కొండలు, గుట్టలు, చెరువులను ఆక్రమిస్తున్న టీడీపీ నాయకులు తీర ప్రాంత భూములను కూడా వదలడం లేదు. సీఆర్‌జెడ్‌(కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) పరిధిలోని భూములను ప్లాట్లుగా విభజన చేసి విక్రయిస్తున్నారు. కొందరికి వేరే సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తుండగా, మరికొందరికీ క్రయ దస్తావేజులు రాసి మోసగిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట సీఆర్‌జెడ్‌ పరిధిలో మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు చిన్నారావు, ధనరాజ్‌, ప్రకాశరావు, మాణిక్యాలరావు తదితరులు ము ఠాగా ఏర్పడి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జ రీ సంతకాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు.

ఎస్‌ఎంపురంలో కొండలకు గుండు

ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ సొసైటీకి చెందిన సర్వే నంబర్‌ 112 సబ్‌ డివిజన్‌ 635/2లో భూములను ముగ్గురు దర్జాగా చదును చేసి ఆక్రమించారు. ఈ భూములపై కోర్టు తీర్పు ఉన్నా.. ఖాళీగా ఉందని కొందరు, డీ పట్టా భూమి ఉందని మరొకరు అక్రమంగా చదును చేసేశారు. ఎస్‌ఎంపురంలో కొండలన్నీ ఆక్రమించేశారు. ఈ మొత్తం బాగోతంలో టీడీపీ నాయకుల పాత్ర కనిపిస్తూనే ఉంది.

చెరువునూ వదల ‘బొమ్మాళి’

కోటబొమ్మాళి మండల కేంద్రంలో మార్కెట్‌కు ఎదురుగా సర్వే నంబర్‌ 91/2 లో సుమారు 28 ఎకరాల 34 సెంట్లు మేర పెద్ద చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం చెరువు గర్భంగానే నమోదు చేసి ఉంది. అయితే ఇదే స్థలంలో దశాబ్ద కాలం కిందట టీడీపీ నాయకుడు కొంత మేరకు రైస్‌ మిల్లు ని ర్మాణం చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చాక మిగతా భూమిని వశం చేసుకున్నాడు. మరికొంత స్థలంలో రేకుల షెడ్లు వేసుకుని అద్దెలకు కూడా ఇచ్చుకున్నాడు.

లావేరులో బరితెగింపు

లావేరు మండలం బొడతవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 113/1, 113/2, 113/3, 113/4, 113/5, 113/7 గల ప్రభుత్వ భూమిని ఒక టీడీపీ నాయకుడు దర్జాగా చదును చేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. లావేరు మండలం బుడతవలస, తా మాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను, రస్తాను, గెడ్డ పోరంబోకును ఆక్రమించినట్టు రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్లు తేల్చారు. బుడతవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు గల 113/1, 113/2, 113/3, 113/4, 113/5లో గతంలో పలువురికి డీ పట్టాలు ఇచ్చారు. వాళ్లు సాగు చేయకపోవడంతో 4.57 ఎకరాల భూ ములను టీడీపీ నాయకుడు అక్రమంగా చదును చేసేసి అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఈ భూములకు ఆనుకుని ఉన్న 28 సెంట్లు ప్రభుత్వ రస్తాను కూడా ఆక్రమించి చదును చేసేశారు. తామాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 105–1లో సాగునీటి కాలువనూ కొందరు ఆక్రమించారు.

మఠం భూములపై పచ్చ గద్దలు

ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలో బావాజీ మఠం భూ ములు ఉన్నాయి. సర్వే నంబర్‌ 121లో దాదాపు 400 ఏళ్ల చరిత్ర గల 199ఎకరాల భూముల్ని సదావత్తుకు(అన్నదానం కోసం) అప్పట్లో కేటాయించారు. వీటిని కొందరు టీడీపీ నాయకులు కబ్జా చేసి, ఆ భూముల చుట్టూ ప్రహరీలు కట్టి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడక్కడే సుమారు 5 ఎకరాల భూముల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఏకంగా అనధికార లేఅవుట్‌ వేసేశారు. ఏకంగా స్టాంపు పేపర్లపై విక్రయాలు జరుపుతున్నారు.

దేవుడి భూములపై కన్ను

పొందూరులో దేవుడి భూములపై కన్నేశారు. శాలిహుండం వేణుగోపా లస్వామి ఆలయ భూ ములు, లక్ష్మీపేట లైన్‌ లోని రామలింగేశ్వరస్వా మి ఆలయం భూ ము లు, సోమలింగేశ్వరస్వా మి ఆలయం భూములు, వెంకటేశ్వరస్వామి ఆల య భూములు కూడా పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. తాజాగా మల్లికార్జున స్వామి ఆలయ భూములను తప్పుడు డాక్యుమెంట్లు చూపించి, విలువైన ఆలయ భూములను కొట్టేసేందుకు ప్లాన్‌ చేశారు.

శ్రీకాకుళంలో కబ్జారాయళ్ల పెత్తనం

శ్రీకాకుళంలోని కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేశారు. శ్రీకాకుళం రూరల్‌ పరిధిలోనైతే లెక్కకు మించి ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు.

ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో ఆక్రమించి, అక్రమంగా చదును చేసిన నాతన్న చెరువు

ఫరీద్‌పేటలో చెరువు కబ్జా

ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో బీజేపీ, టీడీపీ నాయకులు కుమ్మకై ్క చెరువును కబ్జా చేసేశారు. జాతీయ రహదారి పక్కన టీడీపీ, బీజేపీ ఒక్కటై నాతన్న చెరువును ఆక్రమించారు. చెరువును చదును చేసి మిగతా మట్టి తీసుకువచ్చి జాతీయ రహదారి పక్కన కోయిరాల జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రభుత్వ స్థలంలో వేసి చదును చేసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement