టీడీపీ వర్సెస్‌ టీడీపీ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ వర్సెస్‌ టీడీపీ

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

● ఎంపీపీ పదవి తెచ్చిన తంటా

● టీడీపీ ప్రచార వాహనం నిర్బంధం

రణస్థలం: టీడీపీలో తెలుగు తమ్ముళ్ల అధిపత్య పోరు రణస్థలంలో తారాస్థాయికి చేరింది. ప్రధానంగా ఇంకా గెలవకముందే ఎంపీపీ పదవికి నేనేంటే నేను అన్నట్లు పోటీ పడుతున్నారు. ఎంపీపీ పదవి కోసం ఎంపీటీసీల నోటిఫికేషన్‌కు ఆర్నెల్ల ముందు నుంచే తమదేనంటూ చెప్పుకున్నారు. చివరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామ్‌, ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావుల సమక్షంలో ముగ్గురుకి ఐదేళ్లు పంచిపెట్టారు. రావాడకు చెందిన లంక ప్రభాకర్‌కు రెండేళ్లు, కోష్టకు చెందిన పిషిణి జగన్నాథంకు రెండేళ్లు, రణస్థలంకు చెందిన పిన్నింటి భానోజీనాయుడుకు చివరి ఏడాది అని చెప్పి సర్దుబాటు చేశారు.

గెలవక ముందే బెదిరింపులు

ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం పిషిణి జగన్నాథంకు చెందిన ప్రచారం రథం రావాడ గ్రామంలోనికి ప్రచారానికి వచ్చింది. అందులో టీడీపీ ఎంపీపీ అభ్యర్థి పిషిణి జగన్నాథంకు ఓటెయ్యండని గ్రామంలో తిరుగుతుండగా.. స్థానిక రావాడకు చెందిన మరో ఎంపీపీ అభ్యర్థి లంక ప్రభ వర్గీయులు ప్రచార వాహనాన్ని నిలిపివేశారు. మొదట మా నాయకుడు లంక ప్రభాకర్‌కే ఎంపీపీ పదవి వస్తుంటే మీరు ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ ప్రచార వాహనం నిలిపివేశారు. స్థానిక జేఆర్‌పురం ఎస్‌ఐ వి.సత్యనారాయణ, పోలీస్‌ సిబ్బంది ప్రచార వాహనం విడిచిపెట్టాలని చెప్పినా.. పంతంతో రాత్రంతా రావాడలోనే వాహనాన్ని నిర్భందించారు. అనంతరం ఉదయం నియోజకవర్గ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టి వివాదాన్ని సద్దుమణిగించారు. అప్పటికే ప్రచార వాహనం టైర్లలో గాలి తీసివేశారు. వాహనం కొంతభాగం డ్యామేజీ కూడా చేశారు. దీంతో గెలవకముందే టీడీపీలోనే ఇంత దారుణమైన అరాచకం ఉంటే.. సామన్య ప్రజలను ఎంతగా బెదిరిస్తారో ఉహించుకోవాలని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత ఎన్నికలకు విఘాతం కల్గించే ఇటువంటి అభ్యర్థులను గెలిపిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రాజకీయ విశ్లేశకులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement