అధికారుల తీరుపై అంగన్‌వాడీల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై అంగన్‌వాడీల ఆగ్రహం

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అధికారుల తీరుపై అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 61 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు ఓపీఓలుగా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్డర్‌ కాపీ తీసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు ఎంపీడీవో కార్యాలయంలో ఆర్వో గది వద్దకు సుమారు 11 గంటలకు చేరుకుని క్యూలైన్‌లో నిల్చున్నామని అంగన్‌వాడీ కార్యకర్తలు తెలిపారు. తమకు తప్ప పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం వచ్చిన మిగతా వారందరికీ అక్కడ సిబ్బంది ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ లోపలికి పంపించారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరిగ్గా పోస్టల్‌ బ్యాలెట్‌ నింపడం రాదని వేచి ఉంచి, సమయం మించిపోయిందని సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటికి వెళ్లిపోయి రేపు రావాలని అధికారులు సూచించడంపై మండిపడ్డారు. తమకు సోమవారం పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం సమాచారం వచ్చిందని.. ఎవరో ఒకరికి సహాయకులుగా ఇచ్చి ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ నింపినా మిగతావి మేము నింపుకునే వారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏఆర్వో పైడి శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా సరిగ్గా పోస్టల్‌ బ్యాలెట్‌ నింపడం రాకపోవడం వలనే సమస్య వచ్చిందని, రేపు వచ్చి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసుకోవచ్చునని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement