జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ మళ్లింపు

Oct 22 2026 3:32 AM | Updated on Oct 22 2026 3:32 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 23 వరకు నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ సీహెచ్‌ ధనుంజయనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

మళ్లింపు మార్గాలిలా..

● పొట్టి శ్రీరాములు జంక్షన్‌ నుంచి జిల్లా పరిషత్‌ వైపు వచ్చే వాహనదారులు మిల్లు కూడలి – 80 ఫీట్‌ రోడ్డు – పొన్నాడ – సంతోషిమాత ఆలయం జంక్షన్‌ మీదుగా గమ్యస్థానాలకు చేరాలి.

● ఏపీహెచ్‌బీ కాలనీ – సంతోషిమాత జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు పొన్నాడ జంక్షన్‌–వాంబేకాలనీ – 80 ఫీట్‌ రోడ్డు మీదుగా మిల్లు జంక్షన్‌ వైపు వెళ్లాలి.

అభ్యర్థులకు సూచనలు..

● పొట్టి శ్రీరాములు జంక్షన్‌ వైపు నుంచి వచ్చే నామినేషన్‌ వేసే అభ్యర్థులు గూనపాలెం చెరువు గట్టు జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన 100 మీటర్ల కటాఫ్‌ పాయింట్‌ వద్ద వాహనాలు దిగాక అభ్యర్థితో పాటు ఇద్దరు సహాయకులు మాత్రమే నామినేషన్‌ కేంద్రానికి కాలినడకన వెళ్లాలి.

● పొన్నాడ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే నామినేషన్‌ అభ్యర్థులు నందల రోడ్డు జంక్షన్‌ వరకు వచ్చి అక్కడ వాహనాలు దిగి అభ్యర్థి తో పాటు ఇద్దరు సహాయకులు మాత్రమే నామినేషన్‌ కేంద్రానికి కాలినడకన వెళ్లాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement