టీడీపీ నేతలకు పొత్తు షాక్ ఇచ్చింది. జనసేనకు శ్రీకాకుళం నగర పాలక సంస్థ కేటాయించింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ కోసం కోటి ఆశలు పెట్టుకున్న వరం కుటుంబానికి నిరాశే ఎదురైంది. మేయర్ పీఠం ఇస్తామన్న హామీతో టీడీపీలోకి చేరిన అంధవరపు వరం కుటుంబ సభ్యులు జయంతి, ప్రసాద్, సంతో
ష్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనైన వీరి ఆశలు గల్లంతయ్యాయి. అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. టీడీపీ తన సహజ ధోరణి మరోసారి నిరూపించుకుంది. నమ్మించి మో సం చేయడం అలవాటైన వ్యవహారంగా తాజా నిర్ణయంతో తేటతెల్లం చేసింది. ఒక్క అంధవరపు వరం ఫ్యామిలీకే కాదు ఎన్నో ఆశలు పెట్టుకున్న మిగతా నేతలకు మొండిచేయి చూపింది. ఎందుకంటే జనసేన మేయర్ గా పోటీ చేస్తే... వారు కోరుకున్నట్టే డివిజన్లు కేటాయించాల్సి వుంటుంది. అదే జరిగితే మొదటి నుంచి టీడీపీ కోసం పని చేసిన వారికి భంగపాటు తప్పదు.


