వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు వీరే.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు వీరే..

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు వీరే..

కాశీబుగ్గ/ఇచ్ఛాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపు రం మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల ను వైఎస్సార్‌సీపీ అధిష్టానం గురువారం ఖరారు చేసింది. పలాస–కాశీబుగ్గ పురపాలక చైర్‌పర్సన్‌ అభ్యర్థినిగా తాళాసు శ్రీపద్మ పేరు ఖరారైంది. ఈమె భర్త పి.వి.సతీష్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా గత ప్రభుత్వ హయాంలో సేవలందించారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వీరికి జంట పట్టణాల్లో బలమైన సామాజికవరంగా పేరుంది. ఇచ్ఛాపురం పురపాలక చైర్‌పర్సన్‌ అభ్యర్థినిగా పిలక రాజలక్ష్మి పేరు ఖరారైంది. వైఎస్సార్‌ సీపీ తరఫున ఈమె 2014 నుంచి 2026 వరకు రెండు సార్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సేవలందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement