నేటి నుంచి నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నామినేషన్ల పర్వం

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

నేటి నుంచి నామినేషన్ల పర్వం ఎన్నికల సన్నద్ధతపై ఐజీ సమీక్ష

ఇచ్ఛాపురం/కాశీబుగ్గ: ఎన్నికల షెడ్యూల్‌ మేరకు ఇచ్ఛాపురం మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం నుంచి పురపాలక చైర్‌పర్సన్‌, వార్డు కౌన్సిలర్ల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుందన్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రకటన ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కమిషనర్‌ తెలిపారు. పలాస –కాశీబుగ్గ మున్సిపల్‌కార్యాలయంలోనూ ఇదే మాదిరిగా నామినేషన్ల స్వీకరణ జరగనుంది.

శ్రీకాకుళం క్రైమ్‌ : స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై విశాఖపట్నం రేంజి ఐజీ గోపినాథ్‌ జెట్టి ఆరు జిల్లాల ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 606 మంది రౌడీషీటర్లు, 750 సస్పెక్టు షీటర్లు, 12 మంది కేడీ షీటర్లు, ఆరుగురు డీసీ షీటర్లపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్న ట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement