షెడ్యూల్‌ సరే.. | - | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ సరే..

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

షెడ్యూల్‌ సరే.. ● ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్ల తాత్సారంపై విమర్శలు ● అభ్యర్థుల గుండెల్లో స్థానిక గుబులు ● అధికార యంత్రాంగం తీరుపై అనుమానాలు రిజర్వేషన్ల మాటేంటి?

చివరి వరకూ సస్పెన్స్‌..

● ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్ల తాత్సారంపై విమర్శలు ● అభ్యర్థుల గుండెల్లో స్థానిక గుబులు ● అధికార యంత్రాంగం తీరుపై అనుమానాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందే రిజర్వేషన్లను ఖరారు చేయడం చట్టపరమైన నిబంధనల తప్పనిసరి ప్రక్రియ. ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే అధికారిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తారు. జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసినా.. ఇంతవరకు జిల్లాలో అధికారికంగా రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. దీని వెనక ఉన్న గూడు పుఠాణి ఏంటో అర్థం కావడం లేదు. ఎవరి కోసం తాత్సారం చేస్తున్నారో తెలియడం లేదు. అధికార యంత్రాంగంపై అనుమానాలు నెలకొన్నాయి.

సిద్ధమయ్యేది ఎలా..

ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వు అయిందో ముందే తెలిస్తేనే, రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ పోటీపై ఒక నిర్ణయాని కి రాగలరు. షెడ్యూల్‌ వచ్చి రెండు మూడు రోజులైనంత వరకు అధికారికంగా ప్రకటించకపోతే అభ్యర్థులు ఎలా సిద్ధమవుతార న్నది ప్రశ్నార్థకంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్‌లకు సంబంధించి రిజర్వేషన్‌ రూల్స్‌ గెజిట్‌ను ఈ నెల 13న ప్రభుత్వం అధికా రికంగా విడుదల చేసింది. షెడ్యూల్‌ వచ్చేలోపే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆయా స్థానాల రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ, ఇంతవరకు ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు తప్ప ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఖరారు కాలేదు.

అంతా హడావుడే..

గత కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన హడావుడి కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమని అధికార వర్గాలు ప్రకటనలు గుప్పించా యి. అయితే, మొత్తం ప్రక్రియలో కీలకమైన గ్రామ పంచాయతీ సర్పంచ్‌, ఎంపీటీసీ స్థానాల అధికారిక క్షేత్రస్థాయి రిజర్వేషన్ల జాబితా పూర్తిస్థాయిలో స్ప ష్టంగా అభ్యర్థులకు అందుబాటులోకి రాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకటనకు చూపించిన ఉత్సాహం..రిజర్వేషన్లను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కన్పించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీ సీ స్థానాలు ఎవరికి కేటాయించారో ముందు తెలిస్తే నే అభ్యర్థులు రంగంలోకి దిగడానికి అవకాశం ఉంటుంది. అలా దించితే ఇబ్బంది అనుకుంటున్నారో.. ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో తెలియదు గానీ రిజర్వేషన్ల జాబితా విడుదలలో కావాలనే గోప్యత పాటిస్తున్నారా? వ్యూహాత్మక తాత్సా రం చేస్తున్నారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా రిజర్వేషన్లు ముందే ఖరారైతే తప్ప అభ్యర్థులు తమ ప్రచా రాన్ని, ఖర్చులను ప్లాన్‌ చేసుకో లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నామినేషన్ల సమయం వరకు అభ్యర్థులను సస్పెన్స్‌లో ఉంచి, చివరి నిమిషంలో తమకు అనుకూలమైన సమీకరణాల ప్రకారం జాబితాలను బయటపెట్టే వ్యూహం కన్పిస్తుందనే ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూ ల్‌ వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లపై పూర్తిస్థాయి స్పష్టత రాకపోతే నామినేషన్‌ పత్రాలు ఎలా సిద్ధం చేసుకోవాలి? కార్యాలయాల చుట్టూ తిరిగి కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు ఎలా తెచ్చుకోవాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement