జనసేన తానా అంటే తమ్ముళ్ల తందానా.. | - | Sakshi
Sakshi News home page

జనసేన తానా అంటే తమ్ముళ్ల తందానా..

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

జనసేన తానా అంటే తమ్ముళ్ల తందానా..

టీడీపీ నేతలను వైఎస్సార్‌సీపీ ఖాతాలో వేస్తూ కుట్రలు చేరికలపై సోషల్‌ మీడియాలో వ్యవస్థీకృత దుష్ప్రచారం డోల జగన్‌ వైఎస్సార్‌ సీపీ నుంచి చేరినట్టు ఎక్స్‌లో పోస్టు చేసిన జనసేన దానిని పట్టుకుని ఎల్లో మీడియా ప్రచారం

ఈ ఫొటోలో ఉన్నది డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌. ఈయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో చంద్రబాబు టీడీపీ కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నారు. సాధారణ ఎన్నికల్లో కూటమి పార్టీల కోసం పనిచేశారు. ఇప్పుడాయన జనసేనలో చేరారు. దీన్నేమనాలి. టీడీపీ నుంచి జనసేనలో చేరా రని చెప్పాలి. కానీ, జనసేన తమ పార్టీ ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ నుంచి చేరినట్టు పోస్టు చేశారు. దానిని పట్టుకుని ఎల్లో మీడియా, కూటమి పార్టీల అనుకూల సోషల్‌ మీడియాలో అదే ప్రచారం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకులు చేరుతున్నారు. వాటిని వైఎస్సార్‌సీపీ ఖాతాలో వేస్తున్నారు. చేరినవారంతా వైఎస్సార్‌ సీపీ నాయకులే అంటూ కుట్రలకు దిగుతున్నారు. వ్యవస్థీకృత దుప్ప్రచారానికి తెరలేపారు. నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన డోల జగన్‌ ఈ నెల 14న పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఆ విషయాన్ని జనసేన తన పార్టీ ఎక్స్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకుడు డోల జగన్‌ చేరినట్టు పోస్టు చేశారు. వాస్తవంగా, ఆయన టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ కోసం ఎన్నికల్లో పనిచేశారు. ఈ వ్యక్తి టీడీపీ నుంచి జనసేనలో చేరితే వైఎస్సార్‌ సీపీ నుంచి చేరినట్టు జనసేన పార్టీ ఎలా ప్రకటించుకుందో అర్థం కావడం లేదు. ఎక్స్‌లో ఎలా పోస్టు చేసిందో తెలియడం లేదు. చేరిన వ్యక్తి ఏ పార్టీ వారు అని కూడా తెలియకుండా పార్టీలో చేర్చుకుంటుందా? ఏమీ తెలియకుండానే పవన్‌ కల్యాణ్‌ కండువాలు వేసేస్తున్నారా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. అదొక్కటే కాదు.. జిల్లాలో కూడా టీడీపీలో పనిచేస్తున్న వారికే కండువాలు వేసి వైఎస్సార్‌సీపీ నుంచి చేరినట్టు, జనసేన నుంచి టీడీపీలో చేరితే.. వైఎస్సార్‌సీపీ నుంచి చేరినట్టు ప్రచారం చేసుకోవడం విచిత్రంగా ఉంది. ఎన్నికల వేళ మైలేజ్‌ పొందేందుకు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

జనసేనలో వైఎస్సార్‌సీపీ నేత డోల జగన్‌ చేరినట్టు ఆ పార్టీ ఎక్స్‌లో చేసిన పోస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement