లక్ష్యానికి దూరంగా..! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి దూరంగా..!

Oct 16 2026 1:12 AM | Updated on Oct 16 2026 1:12 AM

లక్ష్యానికి దూరంగా..! ఇదీ పరిస్థితి.. సమస్యల చిక్కుముడి..

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో పెరగని ఆదాయం

వసూళ్ల లక్ష్యం రూ.22.96 కోట్లు

తొలి ఆరు నెలల్లో రూ.3.27 కోట్లు మాత్రమే

సరిగ్గా అమలుకాని ఈ–పర్మిట్‌ విధానం

ఇంతవరకూ అందని ఈపాస్‌ యంత్రాలు

వసూళ్లను అధిగమిస్తాం..

హిరమండలం :

జిల్లాలో మార్కెట్‌ కమిటీల పరిస్థితి దయనీ యంగా మారింది. మార్కెటింగ్‌ శాఖ ఆదాయం పెరగడం లేదు. ఆ శాఖలో అవినీతికి చెక్‌ పెట్టేందుకు ప్రవేశపెట్టిన విధానాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలు పూర్తయినా కనీస స్థాయిలో కూడా లక్ష్యానికి చేరువ కావడం లేదు. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో రూ.22.96 కోట్ల వసూలు లక్ష్యంకాగా.. ఇప్పటివరకూ కేవలం రూ.3.27 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. కొన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో వసూళ్లలో వెనుకబాటు కనిపిస్తోంది.

జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, కోటబొమ్మాళి, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పొందూరు, ఆమదాలవలస, పాతపట్నం, హిర మండలంలో వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకుగాను పన్నులు, గోదాముల్లో నిల్వలు ఉంచడం ద్వారా వచ్చే రుసుం మార్కెటింగ్‌ శాఖకు ఆదాయం సమకూరేది. మాన్యువల్‌ విధానంలోనే ఆయా పన్నుల వసూలు ప్రక్రియ జరిగేది. ఈ క్రమంలో పాత తేదీలు వేయడం, తనిఖీ కేంద్రాల్లో సిబ్బంది చేతివా టం ప్రదర్శించడం వంటి అక్రమాలు జరిగేవి. సెస్సు బకాయిలు సైతం పేరుకుపోయాయి. వీటికి చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఈ–ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌ విధానాన్ని జూలై నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ వసూళ్లలో బాగా వెనుకబడింది. ఏప్రిల్‌, మే నెలలో మాన్యువల్‌ విధానంలో రూ. 2.18 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ–పర్మిట్‌ అమల్లోకి వచ్చిన తరువాత జూలై, ఆగస్టు, సెప్టెంబ రు నెలల్లో కేవలం రూ.1.09 కోట్లు మాత్రమే వసూలైంది. ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు నెలలు మాత్రమే గడువు ఉండటంతో లక్ష్యానికి చేరుకోగలరా? లేదా? అనే సందేహం కలుగుతోంది.

కొత్త విధానానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతు న్నాయి. దీంతో ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా అవసరమ య్యే ఈ–పాస్‌ యంత్రాలను ఇంతవరకూ అందించలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏఎంసీలకు 30 వర కూ ఈ–పాస్‌ యంత్రాలు అవసరం. ఇంతవరకూ అందకపోవడంతోనే కొత్త విధానంలో ఈ వసూళ్లు మొదలు కాలేదు. పాత విధానంలోనే వసూళ్లు చేపడుతుండడంతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా తనిఖీ కేంద్రాలు, సెస్‌ వసూళ్లలో పాత విధానమే అమలవుతోంది. ఫలితంగా ఇంకా చేతివాటం కొనసాగుతోంది. ఆపై పన్నుల వసూలు లక్ష్యంపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ–పర్మిట్‌ విధానంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈపాస్‌ యంత్రాలను అందించాల్సిన అవసరం ఉంది.

సాంకేతిక కారణాలతో జాప్యం జరగడం వాస్తవమే. ఈ నెల 15 నాటికి ఈపాస్‌ యంత్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ సాంకేతిక కారణాలు వెంటాడాయి. ఈ ట్రాన్స్‌ఫోర్టు పర్మిట్‌ విధానం వచ్చిన తరువాత ఆన్‌లైన్‌లో పర్మిట్లు జారీ, ఫీజులు చెల్లింపులతో రవాణా ప్రక్రియ పారదర్శకంగా మారింది. ఈ విధానంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. సిబ్బంది వారి మొబైల్‌ ద్వారా ఈ పర్మిట్‌ యాప్‌లోనే అన్ని పనులు జరుగుతన్నాయి.వసూళ్లలో లక్ష్యానికి చేరుకుంటాం. – బి.రవికిరణ్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement